Header Banner

అమెరికాలో కొత్త కరోనా వేరియంట్.. సీడీసీ పరీక్షల్లో వెల్లడి! శరీరంలోని కొన్ని ప్రొటీన్లకు..

  Sat May 24, 2025 16:26        U S A

అమెరికాలో కొత్త కరోనా వేరియంట్ వెలుగులోకి వచ్చింది. శాస్త్రవేత్తలు దీన్ని ఎన్‌బీ 1.8.1గా గుర్తించారు. ఇటీవల చైనాలో కేసుల పెరుగుదలకు ఈ వేరియంట్ కారణమని పేర్కొన్నారు. స్థానిక మీడియా కథనాల ప్రకారం, అంటువ్యాధుల నియంత్రణ సంస్థ సీడీసీ తాజా తనిఖీల్లో ఈ వేరియంట్ ఉనికి బయటపడింది. కాలిఫోర్నియా, వాషింగ్టన్, వర్జీనియా, న్యూయార్క్ సిటీ వంటి చోట్ల సీడీసీ అధికారులు ప్రయాణికులను పరీక్షించారు. ముఖ్యంగా చైనా, జపాన్, దక్షిణ కొరియా, ఫ్రాన్స్, థాయ్‌ల్యాండ్, నెదర్‌ల్యాండ్స్, స్పెయిన్, వియత్నాం, తైవాన్ దేశాల నుంచి వచ్చిన ప్రయాణికుల నుంచి సేకరించిన శాంపిళ్లను పరీక్షించగా ఈ కొత్త వేరియంట్ వెలుగులోకి వచ్చింది. ఏప్రిల్ 22 నుంచి మే 12 మధ్య ప్రయాణికుల శాంపిల్స్‌ను సేకరించారు. అంతేకాకుండా, ఒహాయో, రోడ్ ఐల్యాండ్, హావాయ్ ప్రాంతాల్లో స్థానిక ఆరోగ్య శాఖ అధికారులు కూడా ఎన్‌బీ 1.8.1 వేరియంట్ కేసులను గుర్తించారు. ప్రస్తుతం చైనాలో ఈ వేరియంట్ ప్రబలంగా ఉంది. ఇతర ఆసియా దేశాల్లో కూడా వ్యాపిస్తోంది. హాంకాంగ్‌లో ఇటీవల కరోనా కేసుల సంఖ్య పెరిగింది. గతేడాదితో పోలిస్తే అత్యధికంగా కరోనా కేసులు నమోదయ్యాయి. అయితే, మునుపటి వేరియంట్లతో పోలిస్తే ఎన్.1.8.1 అంత ప్రమాదకరమైనది కాదని హాంకాంగ్ అధికారులు తెలిపారు.

 

ఇది కూడా చదవండి: జనావాసాలపై కూలిన విమానం.. అమెరికాలో భారీ విధ్వంసం..! డజను కార్లు బూడిద..!

 

అయితే, బహిరంగ ప్రదేశాల్లో కచ్చితంగా మాస్క వేసుకోవాలని ప్రజలకు సూచించారు. తైవాన్‌లో కూడా కరోనా కారణంగా కేసులు పెరిగాయి. దీంతో, అక్కడి అధికారులు టీకాలు, యాంటీవైరల్ డ్రగ్స్ నిల్వలు అవసరాలకు సరిపడా ఉండేలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. అయితే ఎన్‌బీ 1.8.1 వైరస్‌‌కు రోగ నిరోధక వ్యవస్థల నుంచి తప్పించుకునే సామర్థ్యం ఇతర వేరియంట్లకు సమానాంగానే ఉన్నట్టు శాస్త్రవేత్తలు చెబుతున్నారు. అయిటే, శరీరంలోని కొన్ని ప్రొటీన్లకు ఇది బలంగా అనుసంధానం అవుతున్న కారణంగా వ్యాప్తి వేగం ఎక్కువగా ఉందని అంటున్నారు. ఇక అమెరికాలో ఫైజర్, మోడర్నా సంస్థలు ఎల్‌పీ.8.1 వేరియంట్‌ను టార్గెట్ చేస్తూ రూపొందించిన టీకాలు ఎన్‌బీ1.8.1ను కూడా కొంత వరకూ నిరోధించే అవకాశం ఉన్నట్టు అమెరికా ఔషధ నియంత్రణ మీటింగ్‌లో చర్చకు వచ్చింది. అయితే, రాబోయే నెలల్లో జేఎన్.1ను టార్గెట్ చేసేలా టీకాలు సిద్ధం చేయాలని కూడా ఎఫ్‌డీఏ సూచించినట్టు తెలుస్తోంది. మీడియా కథనాల ప్రకారం, అమెరికాలో ప్రస్తుతం ఎక్స్‌‌ఈసీ వేరియంట్ కారణంగా కేసులు పెరుగుతున్నాయి. అయితే, కేసుల పెరుగుదల సీజన్‌ల వారీగా ఉంటోందని అధికారులు తెలిపారు. ఏటా రెండు మార్లు కేసులు పెరిగి తగ్గుతున్నాయని అంటున్నారు.

 

ఇది కూడా చదవండి: విజయవాడ విమానాశ్రయానికి మహర్దశ! ఇక నుండి అక్కడికి డైరెక్ట్ సర్వీసులు!

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

కారు ప్రమాదంలో మాజీమంత్రి మనవరాలి మృతి! మరో ఇద్దరు మహిళలు తీవ్రంగా..

 

రెండు జిల్లాలకు రెడ్‌ అలర్ట్‌.. రేపు, ఎల్లుండి పొంచివున్న ముప్పు! భారీ నుంచి అతి భారీవర్షాలు!

 

విజయవాడలో హైఅలర్ట్.. బాంబు బెదిరింపులతో నగరంలో కలకలం!

 

ఢిల్లీ పర్యటనలో ఏపీ సీఎం.. కేంద్రమంత్రి ప్రహ్లాద్ జోషితో చంద్రబాబు భేటీ!

 

హార్వర్డ్‌కు ట్రంప్ సర్కార్ షాక్! అంతర్జాతీయ విద్యార్థుల ప్రవేశంపై నిషేధం!

 

గోల్డ్ లవర్స్ ఇక కొనేసేయండి..! బంగారం ధర తగ్గిందోచ్.. ఎంతంటే.?

 

వైసీపీ మాజీ మంత్రికి అష్టదిగ్బంధన! లుక్ అవుట్ నోటీసులు జారీ!

 

వామ్మో.. భారీగా పెరిగిన బంగారం, వెండి ధరలు.. దెబ్బకు మళ్లీ లక్షకు చేరువలో!

 

స్కూల్ బస్సుపై సూసైడ్ బాంబ్! నలుగురు చిన్నారులు స్పాట్.. 38 మందికి సీరియస్!

 

జగన్‌ను కోర్టుకు రప్పిస్తా! అప్పటి వరకు నిద్రపోను!

 

విజయవాడలో మరో ఇంటిగ్రేటెడ్‌ బస్​ టెర్మినల్‌..! పీఎన్‌బీఎస్‌పై తగ్గనున్న ఒత్తిడి!

 

ఢిల్లీ పర్యటనకు చంద్రబాబు.. నెల రోజుల్లో రెండోసారి! ఈసారి ఎందుకు వెళుతున్నారంటే?

 

ఖరీఫ్ సాగు లక్ష్యంగా మంత్రి అచ్చెన్న కీలక మార్గదర్శనం! రైతు సంక్షేమమే టార్గెట్!

 

టీటీడీలో కీలక నియామకాలు! ఏరి కోరి.. వారి మార్గదర్శకంలోనే ఇక!

 

ఏపీ రైతులకు శుభవార్త.. ఈ కార్డుతో ఎన్నో ప్రయోజనాలు! వెంటనే దరఖాస్తు చేయండి!

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group



   #AndhraPravasi #USA #Indian #Gold #AmericaWomen #Fakejewellery #Rajasthanica